కళింగాంధ్ర

కళింగాంధ్ర కాంతిరేఖ బంకుపల్లి మల్లయ్యశాస్త్రి
వలసపాలనలోని కళింగాంధ్ర ప్రాంతం ఆ పాలన ముగిసిన తర్వాత మిగతా తెలుగుప్రాంతానికి ముందుచూపునిచ్చింది. ఆ ప్రాంతపు సాహిత్యం, రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను స్వాతంత్ర్యం తర్వాతి కాలంలో తెలుగు ప్రాంతం ఆదర్శంగా తీసుకున్నది. అయితే మత సంస్కరణ, సంఘ సంస్కరణ రంగాల్లో ఆ ప్రాంతంలో సాగిన కృషి విస్మరణకు గురైంది. గత అరవై ఏళ్లుగా సాంస్కృతిక రంగంలో వేళ్లూనుకున్న పరిణామాలే దీనికి కారణం. ముఖ్యంగా సాహిత్య రంగంలో వైదికులు – నియోగుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరు ఇతర కులాలవాళ్ల కృషినేగాక ఇతర శాఖల బ్రాహ్మణుల కృషినీ పట్టించుకోకుండా చేసింది. కళింగాంధ్ర వెనుకబడిన ప్రాంతం కావడంతో ఆ ప్రాంత రచయితల – పండితుల కృషి వెలుగులోకి రాకుండ పోయింది. దీనికి తెలుగులో ‘పరిశోధన’ పాకుతూ ఉండడమూ తోడైంది. ఆధునిక సాహిత్య విమర్శకులు సంప్రదాయ సాహిత్యాన్ని ఆ రంగపు కృషినీ పట్టించుకోరు. సంప్రదాయ విమర్శకులేమో సంప్రదాయపు లోటుపాట్లను విడమర్చిన వాళ్లను సహించరు. ఇక సాహిత్య చరిత్ర అంటే మనకు కవుల పట్తికలూ, వాళ్ల గొప్పతనాల ఏకరువులూను!

ఈ పరిస్థితికి బలైన కళింగాంధ్ర సంస్కర్త – పండితుల్లో ముఖ్యులు కీ. శే. బంకుపల్లి మల్లయ్యశాస్త్రి. ఆయన 1876 – 1947 మధ్యకాలంలో శ్రీకాకుళం, ఆ పరిసర ప్రాంతాలలో జీవించారు. బ్రాహ్మణమతాన్ని ధృఢంగా నమ్మినవారు. ధర్మశాస్త్రాలు చెప్పినత్లు కులపద్ధతుల్ని, సంస్కారాలను ఆచరించాలంటూ ఆనాటి ఆచారాల్లో సంస్కరణల్ని వాంఛింఛారు. వాదనతోనే సరిపెట్టుకునే వాళ్లలాకాక చేతల్లోకి దిగిన పండితుడాయన. ఈయన చేతల్ని అడ్డుకోవడానికి ఆరామద్రావిడ కులం ఆయనను వెలివేసింది. అలాగే స్వాతంత్ర్యోద్యమంలో ఓ దశగా, కార్యక్రమంగా సాగిన హరిజనోద్ధరణలో అంటరానివాళ్ల పక్షాన నిలిచి వాళ్లకు మాట, చేత అయ్యారు. ఆయననూ అయన కుటుంబాన్ని జీవితకాలం వెలి వెంటాడినా వెరవని ధీరుడాయన. సాహిత్యరంగంలో నేటి పరిణామాల దృష్ట్యా ఆయన కృషీ, అభిప్రాయాలూ చర్చనీయాంశాలు. భర్త మరణించిన బాలికలకు మళ్లీ పెళ్లి చేయాలనడంలో కందుకూరి వీరేశలింగం గారిది బ్రహ్మసమాజ పద్ధతైతే, మల్లయ్యశాస్త్రిగారిది బ్రాహ్మణమత పద్ధతి. మల్లయ్యశాస్త్రి పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఇరవై ఏళ్లపాటు సంస్కృతం బోధించారు. గిడుగు రామ్మూర్తిగారికి సహోద్యోగి. గిడుగు వ్యవహార భాష ఉద్యమానికి తోడ్పడి మిత్రుడూ, ఆయన దగ్గర ఇంగ్లిషు నేర్చి శిష్యుడూ అయ్యారు మల్లయ్యశాస్త్రి. కూతురు కృష్ణవేణికి తొమ్మిదేళ్లకే భర్త పోవడంతో మళ్లీ పెళ్లి విషయంలో ధర్మశాస్త్రాలు ఏమంటాయో చూద్దామని అయన వాటిని అధ్యయనం చేయపూనుకున్నారు. ఈ కృషి ఐదేళ్లు సాగింది. పునర్వివాహానికి ధర్మశాస్త్రాలు సమ్మతిస్తాయనే నిర్ధారణకు వచ్చారు. ఆధారాలతో తన వాదనను విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, బందరు, నెల్లూరుల్లో పండితుల సభల్లో వినిపించారు. వాదనల్లో నెగ్గారు. నెగ్గిన చోటల్లా పండితుల అంగీకారపత్రాలు తీసుకున్నారు. దేశంలోని 13 మతపీఠాలకు, ఐదు మఠాలకు తన వాదనను పంపించారు. పూరీ మినహా మిగతా మఠాలు, పీఠాలూ ఆయన వాదన అంగీకరించాయి. అలా కోస్తాంధ్రలో ఆయనకు అనాడు సంస్కర్తగా మంచి గుర్తింపు వచ్చింది.

కృష్ణవేణికి ఖమ్మం వాస్తవ్యులైన ‘దీపావళి’ కవి వేదుల సత్యనారాయణ శాస్త్రితో 1929లో పునర్వివాహం చేశారు. ఈ పెళ్లిని గిడుగు కుదిర్చారు. వాసా సూర్యనారాయణ శాస్త్రివంటి పెద్దలు, మిత్రులు ఈ పెళ్లికి తోడుగా నిలిచారు. ఆరామద్రావిడ బ్రాహ్మణకులం ఆయనను వెలివేసింది. కులాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ ‘త్రిలింగ’లో పండితులు విమర్శించారు. ఆ తరువాత మల్లయ్యశాస్త్రి తన ఇద్దరు కుమారులకూ శాఖాపట్టింపులు లేకుండా వితంతువులతో పెళ్లిళ్లు చేశారు. నరసన్నపేటలో కాంగ్రెసు పెద్ద పొట్నూరు స్వామిబాబు వైశ్యుల్లో మళ్లీ పెళ్లికి పూనుకున్నప్పుడు ఆయనకు తోడుగా నిలిచారు. చివరి దశలో బరంపురంలో ఉపాధ్యాయునిగా ఉంటూ ఇటువంటి పెళ్లిళ్లు చేశారు. పునర్వివాహంపై తన వాదనలను వినిపిస్తూ 1934లో ‘వివాహతత్వం’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. కాశీనాధునివారు ముందుమాట రాసి పుస్తక ప్రచురణకు సహాయం చేశారు. మూడు ముద్రణలు పొందిన ఈ ప్రసిద్ధ గ్రంథం నేటికీ విస్మృతమే.

స్వాతంత్ర్యోద్యమంలో హరిజనోద్ధరణ ఎజెండామీదకు వచ్చింది. అంటరానితనం ధర్మశాస్త్రాలకు సమ్మతం కాదని, శాస్త్రాలు తెలియని మధ్యవాళ్లు తెచ్చిపెట్టినదని, ఆచారం పేరుతో సాగే అనాచారమనీ మల్లయ్యశాస్త్రి వాదించారు. 1933లో శ్రీకాకుళం జిల్లా బేసిరామచంద్రపురంలో పుల్లెల శ్యామసుందరరావు నిర్వహణలో జరిగిన గంజాం మండల చారుర్వర్ణ సభలో ఆయన ఈ అంశంపై వాదన చేశారు. అక్కడ అన్ని కులాలతో కలిసి భోజనం చేశారు. పత్రికల్లో కులఛాందసుల విమర్శలను ధర్మశాస్త్రాల ఆధారంగా ఎదుర్కొన్నారు. అంటరానితనం అంటే తోటిమానవులను అవమానించడమేనంటూ గంజాం, విశాఖపట్నం, గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో, మద్రాసులో సనాతన పండితుల సభల్లో వాదించారు. ఈ సభలూ వాదాలతో పాటు తిరువాన్కూర్ (కేరళ)లో చేపట్టిన అస్పృశ్యుల ఆలయప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నవారిలో చెరకువాడ నరసింహం, మాగంటి బాపినీడు,  టంగుటూరి ప్రకాశం, కాశీనాధుని నాగేశ్వరరావుగార్లు కూడా ఉన్నారు. అంటరానివాళ్లకు ఆయన గాయత్రీమంత్రోపదేశం చేశారు. అంటరాని విద్యార్థులతోపాటు తన కుమారుల పెదవులకూ తాకించి తీర్థప్రసాదాలు ఇచ్చేవారు. కులాంతర వివాహం చేసుకుని వెలికి గురైన విద్యార్థుల్ని ఇంట్లోనే ఉంచుకుని చదువు నేర్పారు. వాళ్లకు ఉపాధినీ చూపించారు మల్లయ్యశాస్త్రిగారు.

మాటల్లోనే కాదు, చేతల్లోనూ నిజాయితీ కలిగిన మల్లయ్యశాస్త్రిని గంజాం తాలూకా ‘ఆదిమ ఆంధ్ర సంఘం’ తన కార్యదర్శిగా ఎన్నుకున్నది. ఆదిమ ఆంధ్రులపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగం, పెత్తందార్ల అణచివేత విధానాలను మల్లయ్యశాస్త్రి పత్రికల్లో నిరసించేవారు. అంటరానితనం మీద ఆయన చేసిన వాదనలను ‘అస్పృశ్యత’ పేరుతో (1938లో) పుస్తకంగా ప్రచురించింది విజయనగరంలోని అస్పృశ్యతా నివారణా సంఘం.

బ్రాహ్మణ మత పీఠాధిపతులు, వాళ్ల అనుయాయులు ఆ మతానికి మూలాలైన వేదాల్లో ఏమున్నదో వివరించకుండా వల్లెవేస్తూ, జనాలను ఆచారాలను గుడ్డిగా అనుసరించే మూకగా చేస్తున్నారు, చూస్తున్నారు. అందుకే ఆ వేదాలను అనువదించడం ద్వారా వాటిని లోకానికి విశదం చేయాలని అప్పటి జాతీయోద్యమంలోని ఒక పక్షం భావించింది. జస్టిస్ పార్టీ లేవనెత్తిన బ్రాహ్మణ-బ్రాహ్మణేతర వివాదానికి తెరదించడానికీ, తగిన సమాధానం చెప్పడానికి వేదాల అనువాదం తోడ్పడుతుందని కూడా ఆ పక్షం భావించింది. అప్పుడు మాత్రమే స్వాతంత్ర్యోద్యమం చీలికల్ని అధిగమించి ముందుకు పోతుందని వేదాల అనువాదానికి పూనుకున్నారు. ‘వేదాల అనువాదాలు బయటకు వస్తే వాటినీ, అనువాదం చేసిన వాళ్లనూ తగలేస్తాం’ అని ఛాందసులు భయపెట్టారు. కానీ ఈ అనువాద ప్రయత్నానికి పూనుకున్న వినయాశ్రమం (కావూరు) వారికి బాసటగా నిల్చారు మల్లయ్యశాస్త్రి. మూడేళ్లపాటు కుటుంబంతోసహా ఆ ఆశ్రమంలోనే ఉండి రుక్, సామ వేదాలను అనువదించారు (1940). యజుర్వేదానికి సంపాదకులైనారు. ప్రతి రుక్కునూ ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా సరళమైన తెలుగులోకి వచనంగా అనువదించే పద్ధతిని ఎన్నుకున్నారు.

మల్లయ్యశాస్త్రి పెద్ద కొడుకు సూర్యనారాయణ పర్లాకిమిడిలో జమీందారు కోటముందు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి విదేశీ వస్త్రాలను కాల్చారు. రాజా హైస్కూలులో ఉపాధ్యాయుడైన ఆయననూ, మల్లయ్యశాస్త్రినీ ఉద్యోగాలనుండి తీసేశారు. జస్టిస్ పార్టీ నాయకుడైన పర్లాకిమిడి జమీందారు కృష్ణచంద్ర జగపతి. సూర్యనారాయణతోపాటు మరో కొడుకు కృష్ణశాస్త్రి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. ఉద్యోగాలు పోయి కుటుంబం పేదరికంలో మగ్గిపోతున్నా చలించక, కొడుకుల పక్షాన్నే వహించిన నిలువెత్తు జాతీయతా స్ఫూర్తి ఆయన.

సంస్కరణోద్యమం, జాతీయోద్యమాల అచ్చమైన, అరుదైన కలయిక మల్లయ్యశాస్త్రి. ఈ రెండు ఉద్యమాల్లో సమాన నిమగ్నతతో కృషి చేశారు. సంప్రదాయాన్నే నమ్ముతూ చేతలద్వారా, ఆచరణద్వారా ఆధునికత దిశలో పరివర్తన చెందిన నిజాయితీపరుడు. కందుకూరి వీరేశలింగంలాంటి బ్రిటిష్ భావజాల ప్రభావిత సంస్కర్తలుస్వాతంత్ర్యోద్యమానికి విముఖులైన క్రమానికి ఇది వ్యతిరిక్త పరిణామం. బాధితుల పక్షాన నిలబడే సంప్రదాయ మేధావుల సహజ పరిణామ క్రమమూ ఇదే.

ఉర్లాం, పర్లాకిమిడి, నరసన్నపేట, బరంపురాల్లో 1947 వరకు జీవించిన ఈ కళింగాంధ్ర చైతన్యం, అరుదైన వ్యక్తిత్వం, తాటాకు గ్రంథాల్లోంచి పొడుచుకుని వచ్చిన ఈ ఆధునికతా వేకువ రేఖ కాశీయాత్రనుండి తిరిగి వస్తూ ఖడ్గపూర్ లో సెప్టెంబర్ 26 (1947)న అదృశ్యమైంది. బ్రాహ్మణుడుకాని విద్యార్థి ఒకరు చివరిదశలో సేవలు చేశాడు ఆయనకు. అంత్యక్రియలూ జరిపారు. ఆయన 60వ వర్ధంతి సందర్భంగా ఆయన భావాల్ని చర్చించి, కృషిని అంచనా వేయడమే ఆయనకు మనం అర్పించగలిగే నివాళి.

(2007 సెప్టెంబరు 26 న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కీ. శే. బంకుపల్లి మల్లయ్యశాస్త్రి విగ్రహావిష్కరణ సందర్భంగా డాక్టర్ కె. ముత్యం ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక వివిధ (24.09.2007) లో ప్రచురితమైన వ్యాసమిది)

కళింగాంధ్ర మాండలిక కోశానికి స్వాగతం…1
“కళింగాంధ్ర మాండలిక కోశం” మొదటి భాగం

రచయిత: జి. ఎస్. చలం

కళింగాంధ్ర మాండలిక కోశానికి స్వాగతం

ఇరవయ్యో శతాబ్ది ఆరంభానికి ముందే కళింగ ప్రాంతంలో మాండలిక భాషా విషయాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. మాండలిక సాహిత్యమే వెలసింది. కన్యాశుల్క రూపంలో – ముత్యాలసరాల రూపంలో మొదట ఆ సంచలనాత్మక రచనా ధోరణికి పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలయింది. వాదవివాదాలు ఒక మహోద్యమానికి దారి తీశాయి. వ్యావహారిక భాషావాదాన్ని ఒక మహా రచయిత, మరో మహా విద్వాంసుడు తమ భుజ స్కందాల మీదికి ఎత్తుకున్నారు. పోరాడారు. ఒకరు ప్రధానంగా తమ రచనల ద్వారా ఆ వాదానికి పరిపుష్టి కలిగిస్తే, మరొకరు పండిత లోకాన్ని పాండిత్యబలంతోనే నిలువరించి చివరికి నిర్జయించారు. 1910 నాటికి వాదబలం పెరిగి పాఠ్యగ్రంథాల్లో వ్యావహారిక రచనలకు స్థానం కల్పించవలసి వచ్చినా, ఆ విజయం తాత్కాలికమైంది. ప్రతిఘటించిన గ్రాంథిక భాషావాదం ఆంధ్ర సాహిత్య పరిషత్తు ధర్మదార పట్టిన తరువాత కూడా కొనసాగింది. అయితే కాల క్రమాన నీరసించక తప్పింది కాదు.              గ్రాంథిక వ్యావహారిక వాదాలు తీవ్రాతితీవ్రంగా జరుగుతున్న రోజుల్లో తెలుగు వాడుకలోని మాండలిక భేదాలు సాహితీ సమగ్రతకూ గౌరవానికీ వ్యాఘాతం కల్పిస్తాయన్న ప్రసంగం వచ్చింది. గిడుగు వెంకట రామమూర్తిగారు తమదైన ధోరణిలో ‘అనప, ఆనప, సొర, సోర్ర ‘ అనే భెదంవల్ల ఆయా మాండలిక రూపాలు, పదాలు ఇతర ప్రాంతాలవారికి స్పష్టంగా అర్థం కావనే వాదనకు సమాధానంగా ఆ కారణంచేత ‘అలీబూ ‘ అనే సంస్కృత పదం వాడి ఎవరికీ అర్థం కానట్లు రాయడం మంచిదా? అని ఎదురు ప్రశ్న వేశారు. కత్తిపిడితోనే శత్రువాదాన్ని ఖండించారు. మాండలిక నిఘంటువులు తయారుచేసి తెలుగు భాషా సంపదను ప్రదర్శించమని వ్యాఖ్యానించారు. అప్పటికి ఉన్న నిఘంటు వ్యాకరణ గ్రంథాలు గ్రాంథిక / కావ్య భాషకు మాత్రమే స్వీకరించినా, ఉయ్యాల వంటి మాటలకు ఎన్నో రూపాంతరాలున్నాయి. అయినా కావ్యభాష ఆమోదయోగ్యమైనప్పుడు వాడుక భాషలో ఎందుకు మాండలికాలు పనికి రాలేదని ప్రశ్న. నిజానికి ఆయా మాటలకున్న అర్థాలూ అర్థ విశేషాలూ ప్రకరణాన్ని బట్టి, వాక్యంలో వాటికున్న స్థానాన్నిబట్టి స్పష్టమవుతాయి. సందర్భం నుంచి తొలగించినపుడు భిన్న ప్రాంతాలవారికి స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. స్థానికులకు వాటి ప్రయోగం ఆత్మీయతా భావాన్ని కల్పిస్తుంది. రససిధ్ధికి ఎంతో తోడ్పడుతుంది. ప్రతివ్యక్తికీ తానువాడే కొన్ని వందల మాటలు మాత్రమే పూర్తిగా అర్థవంత మనిపిస్తాయి. అనేకేతర పదాలు నిత్య వ్యవహారంలో లేకపోయినా సందర్భాదులను బట్టి అస్పష్టంగా నయినా బోధపడతాయి. ఈ లోకం మాటలను పాసివ్ వొకాబులరీ అంటారు. (మాండలిక) నిఘంటువులు వీటి అర్థాలను, అర్థ భేదాలను వివరిస్తాయి. ఆ నిఘంటువులకు ఉపయోగించినవారికే ఈ రకం పదజాలం స్పష్టంగా అర్థబోధ చేస్తుంది. మరో మార్గం లోకజ్ఞులయిన పండితుల ద్వారా తెలుసుకోవటం.              గిడుగు రామమూర్తిగారు మాండలిక నిఘంటువులను సిద్ధం చేయండన్న తరువాత వెలువడ్డ సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి మహా నిఘంటువుల్లో అందుకు ప్రయత్న లేశమన్నా జరగలేదు. 1947 ప్రాంతాల్లో కొందరు భాషాభిమానులైన సాధారణ పౌరులే ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో తమకు విశేషమనిపించిన ప్రాంతీయ పదాలకు అర్థ వివాణ చేస్తూవచ్చారు. పదిమంది కలిసి పనిచేయడం, కార్యసాధన చేయటం తెలుగువారికే కాదు భారతీయ జాతి మొత్తానికి స్వభావ విరుద్ధమైన పని. మనం వ్యక్తి వాదులం – సమష్టివాదులం కాదు. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బహువిధ రాజకీయ వివాదాల మధ్య నెలకొన్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర సాహిత్య అకాడమీ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఆ మహా సంస్థ ఏమి చేయలనే చర్చలు చాలాకాలం అనేక విధాలుగా జరిగిన తర్వాత మాండలిక వృత్తి పదకోశాలను తయారుచేయాలని నిర్ణయించింది. మార్గ నిర్దేశం చేయడానికి ఒక ఉపసంఘాన్ని, సంపాదక వర్గాన్ని ఎంపిక చేసింది. అంతకు కొంత ముందుగానే ప్రాచీనాంధ మహాకావ్యాల్లో నన్నయాది మహాకవులు ఏయే పదాలను ఏయే సందర్భాల్లో ఎన్ని అర్థ విశేషాల్లో ప్రయోగించారో సోదాహాణంగా సిద్ధపరిస్తే, ప్రయోగ పరిశీలనద్వారా తరవాతి కాలంలో భిన్నార్థ నిర్ణయం చేయవచ్చనుకున్నారు.  పద ప్రయోగ సూచికలు తయారుచేసేటప్పుడు కాలాన్ని వ్యయాన్ని తగ్గించటం కోసం తద్భవాచ్చిక పదాల ప్రయోగాలను సూచిస్తే చాలనుకున్నారు. క్రియారూపాల విషయంలో తత్సమక్రియలను కూడా గ్రహించవచ్చన్నారు. అందువల్ల తెలుగులో ఎరువు మాటలుగా వచ్చిన అనేకానేక సంస్కృత పదాలు, పదబంధాల ప్రయోగ వైచితి మరుగున పడ్డది. నన్నయ, తిక్కన, శ్రీనాథాదుల గ్రంథాలనుంచి పద ప్రయోగాల సూచికలు వెలువడ్డా సోమన, పోతన వంటి మహామహుల రచనలకు ఆ భాగ్యం పట్టనేలేదు. అబ్బిరాజు సూర్యనారాయణ గారనే ఆంధ్రోపాధ్యాయుడు తన అన్నగారితో కలిసి కొంతకాలం, విడిగా చాలాకాలం శ్రమించి సిద్ధం చేసిన ఆంధ్ర మహాభారత నిఘంటు ముద్రణకు సాహిత్య అకాడెమి పెట్టగలిగినన్ని పేచీలు పెట్టి మొత్తానికి అజాది పదకోశాన్ని పూర్తిగా ప్రచురించింది. హలాది పదాల ప్రచురణ చేపట్టేనాటికి నిఘంటుకారులు అస్తమించారు. అసంగ్రంగా ఉన్న శేషభాగ ప్రచూణ జరుగుతుండగా అకాదమీయే అంతరించింది.              అంతరించే ముందు అకాడమీ ఎంతోకొంత మాండలిక పద సేకరణ ప్రచురణలకు తోడ్పడిందని అంగీకరించాలి. భిన్న ప్రాంతాల్లో పర్యటించి ఆయా వృత్తులకు సంబంధించిన ప్రస్తుత వ్యవహారంలో ఉన్న మాండలిక పదజాలాన్ని సేకరించి ప్రచురించాలని నిర్ణయించారు. వ్యవసాయం, చేనేత, మత్స్య పరిశ్రమ, పడవల నిర్మాణం, గృహ నిర్మాణాది వాస్తు పరిశ్రమ, కమ్మరు, కుమ్మరం, వడ్రంగం, మేదర, స్వర్ణకార, లలితకళా వృత్తులకు సంబంధించిన మాండలిక కోశాలు వెలువడ్డాయి. కొన్ని నిర్మాణంలో ఉండగానే అకాడమీ అంతరించింది. దానికి వారసుగా అనేకేతర కార్యక్రమ భారబంధురమైన తెలుగు విశ్వ విద్యాలయం అవతరించింది. ఈ అవతరణకు ముందే ఆరంభించిన మరి రెండు కోశాలు, జంతువులు పక్షులు వేటలకు సంబంధించినది ఈ శతాబ్దాంతానికయినా వెలుగు చూస్తాయని చెప్పలేం. ఖర్చులు జరుగుతుండవచ్చు గాని పని నెరవేరుతుందనే నమ్మకం లేదు. సాహిత్య అకాడమి బతికి ఉండగానే మరువూరి కోదండ రామరెడ్డిగారి సంపాదకత్వంలో ఒక మాండలికా పదకోశం వారి ఆధ్వర్యంలో వెలువడింది. ఇందులో వృత్తి మాండలికాలుగాక వ్యక్తి మాండలికాలకు ప్రాముఖ్యమిచ్చారు.              తెలుగు అకాడమి అనే మరో సంస్థ వాణిజ్య పదకోశమనే వృత్తి పదకోశాన్నీ, మాండలిక పదకోశాన్నీ ప్రచురించింది. కానీ ఆ సంస్థ ప్రధాన కర్తవ్యాల్లో ఒకటి భిన్న మండలాల్లో పర్యటించి భిన్న వృత్తుల, వయస్సుల, విద్యా భేదాల వంటి లక్షణాలున్న వ్యక్తులనుంచి ఉచ్చారణ భేద, వ్యాకరణ లక్షణాదులను సేకరించి తెలుగులో, ఇంగ్లిషులోనూ గ్రంథాలు ప్రచురించటం. కరీం నగర్, కడప, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్లు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, నిజామాబాద్ మాండలికాలను గురించిన తెలుగు పుస్తకాలనూ, గుంటూరు, వరంగల్లు, విశాఖపట్నం, శ్రీకాకుళం మాండలికాల గురించి ఇంగ్లిషు పుస్తకాలనూ 1988లోగా ప్రచురించారు. దరిమిలా మరి కొన్ని గ్రంథాలు ఉభయ భాషల్లోను వచ్చి ఉండవచ్చుగాని వాటిని చూడగలిగిన భాగ్యం ఉద్యోగ విరమణ వల్ల నాకు కలగలేదు. వీటన్నిటిలో ఆయా మాండలిక పదాలే గాక వాటి విలక్షణతలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.